జూన్ 7న హిప్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ బాగా హైలెట్ అయ్యాడు. లవ్ -యాక్షన్ జోనర్‌ను తనదైన శైలిలో కార్తికేయ పండించిన తీరు అతని స్టామినాను తేటతెల్లం చేసింది. కార్తికేయ చేస్తున్న తాజా చిత్రం -హిప్పీ. టైటిల్‌తోనే ఒకవిధమైన మూడ్‌ను ఆవిష్కరిస్తోన్న ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత కలైపులి థాను నిర్మిస్తున్నారు. దీంతో చిత్రంపై భారీ అంచనాలు పేరుకున్నాయి. చిత్రాన్ని జూన్ 7న భారీస్థాయిలో థియేటర్లకు తెచ్చేందుకు నిర్ణయించినట్టు అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ పోస్టర్‌ను బయటకు వదిలారు. టీఎన్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో కార్తికేయకు జోడీగా దిగంగన సూర్యవన్షీ తెలుగు తెరకు పరిచయం కానుంది. జెడీ చక్రవర్తి, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ ఓ రియలిస్టిక్ స్టోరీని ఎంటర్‌టైన్‌మెంట్ వేవ్‌లో చెబుతూనే అన్ని కమర్షియల్ అంశాలను పెర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశాడు దర్శకుడు. ఔట్‌పుట్ చూసిన తరువాత టీం మొత్తం హ్యాపీగా ఉన్నాం. మ్యూజిక్, ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అస్సెట్స్ అన్నాడు. జెడీ చక్రవర్తి మాట్లాడుతూ కథలో నా పాత్రకువున్న ఇంపార్టెన్స్ చూసి వెంటనే ఒప్పుకున్నా. కార్తికేయ మంచి పెర్ఫార్మర్ అన్న విషయం ఆర్‌ఎక్స్ 100తో ప్రూవైంది. కెరీర్ బిగినింగ్‌లోనే హిప్పీలాంటి కథ కుదరడం గ్రేట్. కలైపులి థాను బ్యానర్‌లో సినిమా చేయడం హ్యాపీ అన్నాడు. దర్శకుడు టిఎన్ కృష్ణ మాట్లాడుతూ కథ చాలా సింపుల్. మన కుటుంబంలోనో, స్నేహితుల జీవితాల్లోనో జరుగుతున్న అంశంలా అనిపిస్తుంది. కార్తికేయకు యాప్ట్ సబ్జెక్టు. యూనిట్ సహకారంతో వేగంగా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్‌ప్రొడక్షన్స్ అవుతున్నాయి అన్నారు. నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ హిప్పీ అందరికీ నచ్చే కథ. ఒక్కముక్కలో చెప్పాలంటే ఔట్‌స్టాండింగ్ స్క్రిప్ట్’ అన్నారు.