ఇంత సంతృప్తి ఎప్పుడూ లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. అందుకే సినిమా విషయంలో నమ్మకంగావున్నా. కారణం -ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చింది. గొప్ప సినిమా చేశానన్న ఫీలింగ్ సంపూర్ణంగా కలిగింది దీంతోనే అంటున్నాడు జెర్సీ గురించి హీరో నాని. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో నానితో ఇంటర్వ్యూ...

రమణ్ లాంబా లైఫ్ స్టోరీనా?
టీజర్, ట్రైలర్ చూసి బయోపిక్ అనుకుంటున్నారేమో. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. రమణ్ లాంబా కూడా క్రికెట్ నుంచి బయటికెళ్లి మళ్లీ వచ్చాడు. దానికి దగ్గరగా ఉందంటూ సోషల్ మీడియా పోస్ట్.. కాపీ పేస్టులు జరిగి నావరకూ చేరింది. జెర్సీ బయోపిక్ కాదు.
జెర్సీ అంటే?
-నిజానికి జెర్సీ అంటే స్పోర్ట్స్ యూనిఫాం. క్రికెట్‌కు దగ్గరగా ఉందని ఆ టైటిల్ పెట్టామనుకోవద్దు. టైటిల్‌కువున్న రీజన్ సినిమా చూశాక అర్థమవుతుంది.
మజిలీతో పోలిక ఉంటుందా?
జెర్సీతో బిజీగా ఉండి ఆ సినిమా చూడలేదు. సో, పోలికలు చెప్పలేను.
అర్జున్ సక్సెస్‌ఫుల్ క్రికెటరా? ఫ్రస్ట్రేటెడా?
-రెండూ కావచ్చు, కాకపోనూవచ్చు. ట్రైలర్‌లోనే చాలా కథ చెప్పేశాం. లూసర్ అనడం, తక్కువచేసి మాట్లాడటం అన్నీ. వాటివల్ల ఫ్రస్టేషన్ ఉంటుంది. దాంతో అర్జున్ జీవితంలో ఏంజరిగిందనేది కథ.
షార్ట్ టైంలోనే ఓకే అన్నారట?
-కథ మామూలుగానే విన్నా. షార్ట్‌టైంలో నిర్ణయం తీసుకున్నా. అంత బాగా నచ్చింది.
క్రికెట్ ఆడేవారా?
-గల్లీ క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో లాస్ట్ బ్యాట్స్‌మెన్‌ని. అంతా ఔటయ్యాకో, ఎవరికైనా దెబ్బ తగిలితేనో అవకాశం వచ్చేది. ఆ టైప్ బ్యాచ్ అన్నమాట.
సినిమాతో క్రికెట్ పట్ల మీ దృక్పథం?
-ఇంతకుముందు ఛానల్‌లో క్రికెట్ వస్తుంటే రిమోట్ నొక్కేసేవాడిని. ఇపుడు చూస్తున్నా. ఎందుకంటే ట్రైనింగ్ తర్వాత ఆటపట్ల అవగాహన పెరిగింది. కేవలం బ్యాట్‌తో బాల్‌ను ఫోర్లు, సిక్స్‌లు బాదడం కాదు. వీటికి మించింది ఏదో ఉందనిపిస్తోంది.
ఇందులో పేర్లు కలిసాయి?
-నిజమే. గౌతమ్ సినిమాను రాసుకున్నప్పటివే. వాటితోనే కంటిన్యూ అయిపోయాం. ఎమోషనల్‌గా అందరికీ కనెక్టయ్యే సినిమా.
అంతగా నచ్చిన పాయింట్?
-నేరేషన్ టైంలోనే పాత్రలో లీనమయ్యాను. లెక్కలు వేసుకునేంత టైం కూడా లేదు. నేనే కాదు, సినిమా చేసినోళ్లంతా గొప్ప ఫీలింగ్‌లో ఉన్నారు. సంతోషంతో కళ్లల్లో నీళ్లు తిరిగే సన్నివేశాలూ చూస్తారు.
మళ్లీ రావా చూశారా?
-లేదు. కాకపోతే కథ నచ్చింది. అతనిలో నిజాయితీ నచ్చింది. అందుకే గౌతమ్ ప్రీవియస్ సినిమా చూసి జడ్జ్ చేయాలనుకోలేదు. గొప్ప సినిమా చేయబోతున్న ఫీలింగ్ కలిగింది. ఇంతకుముందూ ఎమోషనల్ మూవీస్ చేశా. కాకపోతే, వాటికీ దీనికీ తేడా ఉంది.
ఫాదర్ క్యారెక్టర్ ఎక్స్‌పీరియన్స్?
-ఇబ్బంది లేదు. ముసలాడిగా చేయమన్నా చేయడానికి సిద్ధంగావున్నా. నటుడిగా నాది కాని వయసులో నటించడాన్ని ఎంజాయ్ చేస్తా.
సత్యరాజ్‌తో పనిచేయడం?
-ఆయనతో పనిచేయడం పెద్ద లెర్నింగ్. ఇనే్నళ్ల నటనా కెరీర్‌లో ఆయతో మాట్లాడుతుంటే వినడానికి సతోషంగా, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉన్నట్టుగా అనిపించింది.
స్టార్‌డమ్‌ని నమ్ముతారా?
-ఖచ్చితంగా. స్టార్‌డమ్ మీద నాకు నమ్మకముంది. కాకపోతే ఇప్పటిలాగా అందరూ నమ్మే స్టార్‌డమ్ కాదు. కంటెంట్‌వల్లే స్టార్‌డమ్ వస్తుందని నమ్ముతా.
కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారు?
-అలాంటిదేమీ లేదు. నా వరకు నచ్చిన వాటిలో నాకు నచ్చినదాన్ని సెలెక్ట్ చేస్తున్నా. నాకు అర్థమైన రీతిలో ముందుకుసాగుతున్నా. అది నాకే తెలియకుండా నా కెరీర్‌కి ఉపయోగపడుతోంది. నేనేం చేసినా నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, నాకు అర్థమైంది కాబట్టి చేస్తున్నా.
సినిమా, సినిమాకూ వత్తిడి పెరగుతుందా?
-సినిమా సినిమాకు ఎదగడం అనేది నాకేమీ వత్తిడిగా లేదు. ఎంసిఏ తర్వాత బాగా వత్తిడి ఫీలయ్యా. ఇపుడు లేదు. ఒకప్పుడు జెండాపై కపిరాజు, పైసా, అహ నా కల్యాణం అన్నీ ఫ్లాపులే. ఆ టైంలో ఎవడే సుబ్రమణ్యం లాంటి కథను అంగీకరించాను. నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్లానంతే. దానికి వత్తిడి ఎందుకు?
మీ గురించి రూమర్స్ వస్తే..?
-ఇపుడు నాకు అర్థమైంది ఒక్కటే. వాటిని పట్టించుకోనవసరంలేదు అని! బిగినింగ్‌లో నాకు ఆ విషయం తెలీక ఫీలయ్యేవాడిని. అలాంటి థాట్ ప్రాసెస్‌లో వున్నవాడు అసలు బతకలేడనే విషయం తెలిసింది. స్టార్టింగ్‌లో ఎవరైనా ఏదైనా రాస్తే అది కోపం వచ్చి రాశారేమో అనుకునేవాడిని. కానీ ఇపుడు రాయడం వాళ్లధర్మం. ఇగ్నోర్ చేయడం మన ధర్మం అనుకుంటున్నా.
బిగ్‌బాస్‌వల్ల ఏం నేర్చుకున్నారు?
- నేను, మనం ప్రపంచానికి పరిచయం కావడంకన్నా, ప్రపంచం మనకు పరిచయం కావడం ఇంపార్టెంట్. బిగ్‌బాస్‌తో అలా నాకు ప్రపంచం పరిచయమైంది. కాకపోతే ఒక్కో ఎపిసోడ్ అక్కడ జరుగుతున్నకొద్దీ ఇక్కడ సోషల్ మీడియాలో దాని రిప్లెక్షన్ ఉండేది. షోలో హీట్ పెరిగేకొద్దీ ఇక్కడ సోషల్ మీడియాలో హీట్ పెరిగేది. ‘ఇది నా ఆఖరి ఎపిసోడ్’ అని ఎపుడు ట్వీట్ చేశానో, ఆ తర్వాత ‘నాని అన్నా.. ప్లీజ్ కమ్‌బ్యాక్’ అని అడుగుతున్నారు.
వెబ్ సిరీస్ చూస్తారా?
-తప్పకుండా చూస్తా. ఎందుకంటే ఇపుడున్న ప్రపంచంలో వెబ్ సిరీస్ చాలా దూరం వెళ్తుంది. దాని భవిష్యత్ చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. మెయిన్ ప్రొడక్షన్ హౌస్‌లు అందరూ సినిమా, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. నా దగ్గర అలాంటి కంటెంట్ లేదు. ఉంటే నా ప్రొడక్షన్ హౌస్‌లోనూ చేస్తానేమో.
ఓవర్సీస్ మార్కెట్ గురించి?
-ఓవర్సీస్ మార్కెట్ అనేది ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలను అప్రీషియేట్ చేసేది కాదు. వాళ్లు ప్రాపర్ కమర్షియల్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. మనం చెప్పాలనుకున్న కథలు కరెక్టుగా చెప్పడానికి ఓవర్సీస్ మార్కెట్, తెలుగు మార్కెట్‌ను ఎక్స్‌పాండ్ చేస్తుంది.
రెమ్యూనరేషన్ పెంచారా?
-మీరు చెప్పండి, ఎంత పెంచానో (నవ్వుతూ). సినిమాను బట్టి మారుతుందండీ.
మీ దర్శకుడు గౌతమ్ గురించి?
-జెన్యూన్ పర్సన్. ఆయన్ని చూడగానే చాలా నిజాయితీగా ఉన్నాడనిపిస్తుంది. ఈ సినిమాకు ఆయనతో పనిచేసినపుడు ఇంకా బాగా అర్థమయ్యేవాడు. కొన్నిసార్లు ఆయనలో ఇంత లోతు మనిషి ఉన్నాడా? అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి సీనులోనూ గౌతమ్ కన్పిస్తాడు.
నిర్మాత గురించి?
-నా క్లాస్‌లో వంశీ ఉండేవాడు. చాలా స్మార్ట్. క్రికెట్ అంటే పిచ్చి. అప్పట్లో చాలా చరిష్మా ఉండేది. తర్వాత ఇండస్ట్రీలో వంశీ అనే పేరుతో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడని తెలుసు. ఒకసారి మా క్లాస్‌మేట్ కలిసినపుడు ఇండస్ట్రీలో వంశీ ఉన్నాడని తెలిసింది. ఈ సినిమాకు ముందు మాట్లాడుకున్నాం. అదేంటో తను మాత్రం నన్ను ‘సార్’ అని పిలుస్తూ ప్రొటోకాల్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తానికి కాస్త కంగారుగా ఎవరైనా ఉన్నారా? అంటే అది వంశీ మాత్రమే. జెన్యూన్ ప్రొడ్యూసర్.
హీరోయిన్ గురించి?
-ఒకసారి విక్రమ్ వేదా పాట చూశాను. శ్రద్ధను చూడగానే చాలా జెన్యూన్‌గా అనిపించింది. తనలో సారా పాత్రలో వున్న లక్షణాలు పుష్కలంగా కనిపించాయి. సెట్లో తను నటిస్తుంటే చూసి ఆశ్చర్యపోయా. తనకు చాలా మంచి ఫ్యూచర్ వుంది.
నేచురల్ స్టార్ టాగ్ ఎంజాయ్ చేస్తున్నారా?
-ముందు అంతా అంటుంటే ‘ఎందుకు’? అనుకునేవాడిని. తర్వాత కొన్నాళ్లకి ప్రేమ అని అర్థమైంది. నాకు ఇంట్లో నవీన్ అని పేరు పెడితే మా అమ్మ నానీ అని ముద్దుగా పిలిచింది. ఇపుడు అభిమానులూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. అందుకే నేచురల్ స్టార్ అని పిలిచినా నాకు ఆనందంగానే ఉంది.

-శ్రీనివాస్ ఆర్ రావ్