సూర్య 24 పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు సూర్య, సమంత జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘24’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో రూపొందిన ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కార్తి సీడీని ఆవిష్కరించారు. మరో హీరో అఖిల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా ఇది. విక్రం ఈ కథను నాలుగు గంటలపాటు చెప్పాడు. కథ విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాను. రెహమాన్‌గారికి ఎన్ని కమిట్‌మెంట్లు వున్నా నా కోసం సినిమా ఒప్పుకున్నాడు. నిత్య, సమంతల సహకారం మరువలేనిది’ అని అన్నారు. రెహమాన్ మాట్లాడుతూ, తెలుగువారందరికీ అభినందనలని, ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య, విక్రంలకు థాంక్స్’ అన్నారు. దర్శకుడు విక్రం కె.కుమార్ మాట్లాడుతూ, సూర్య ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నానని. రెహమాన్‌తో పనిచేయడం మర్చిపోలేని అనుభూతని అన్నారు. ఆయనతో భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానన్నారు. అఖిల్ మాట్లాడుతూ, ‘గజిని’ సినిమాతో సూర్యను చూసిన తరువాత నటుడంటే ఇలా వుండాలని ఆయన అభిమానిగా మారిపోయానని, విక్రం జీనియస్ డైరెక్టరని, రెహమాన్ అద్భుతమైన పాటలు ఇచ్చారని అన్నారు. వీరికి కలయికలో వస్తున్న సినిమా మంచి విజయం సాధించాలన్నారు.

చిత్రం ‘24’చిత్రంలోని పాటల సీడీలను విడుదల చేస్తున్న చంద్రబోస్, సూర్య, రెహమాన్, విక్రమ్‌కుమార్, కార్తీ, కొరటాలశివ, అజయ్