వంశీతో రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజవౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకోసం ఏడాదిపాటు డేట్స్ ఇచ్చేసిన చరణ్ ఆ తరువాతి సినిమానుకూడా లైన్‌లో పెట్టాడట? చరణ్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్‌బాబుతో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 9న విడుదలకానుంది. తాజాగా చరణ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ వంశీ పైడిపల్లితో ఉంటుందంటూ మెగా వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే వచ్చిన ఎవడు సంచలన విజయం సాధించింది. దాంతో మరో సినిమా వంశీతో చేయడానికి అప్పుడే చరణ్ ఆసక్తి చూపించాడు. అందులో భాగంగా అటు చరణ్‌కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధంచేస్తున్న వంశీ పైడిపల్లి అతనికి ఓ లైన్ కూడా చెప్పి ఒప్పించాడని టాక్. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని అడిగాడట.