మహేశ్‌తో.. పరశురామ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తా చూపించాలేగానీ మెగాఫోన్‌కు కొత్తయినా స్టార్ హీరోలు సైతం పిలిచి ప్రాజెక్టులిస్తారు. ఇప్పుడు దర్శకుడు పరశురామ్ పరిస్థితి అలాగే ఉంది. విజయ్ దేవరకొండ -రష్మిక మండన్నల ‘గీత గోవిందం’ని అద్భుతంగా చూపించి సంచలన విజయం నమోదు చేశాడు పరిశురామ్. దాంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే మరో సినిమాకు చాన్స్ వచ్చేసింది టాలెంటెడ్ డైరెక్టర్‌కి. సో, గీతా ఆర్ట్స్‌లో అంటే అంతా బన్నీతోనో, శిరీష్‌తోనో సినిమా ఉంటుందేమో అనుకున్నారు అంతా. కానీ ఇక్కడే సీన్ మారింది. పరశురామ్‌కు దక్కిన చాన్స్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కావొచ్చని అంటున్నారు. ఆమధ్య మహేష్ ఇంటికెళ్లిన అల్లు అరవింద్, క్యాజువల్‌గానే కలిసి ప్రాజెక్టు చేద్దామన్న ప్రతిపాదన మహేష్ వైఫ్ నమ్రత ముందు పెట్టినట్టు తెలుస్తోంది. పరశురామ్ దగ్గర మంచి కథ ఉందని, మహేశ్ డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్టు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారట. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా అంటే తప్పకుండా డేట్లు అడ్జెస్ట్ చేయొచ్చని అంటూనే, స్క్రిప్ట్ వర్క్ పూరె్తైన తరువాత ఒకసారి విందామన్నట్టు నమ్రత అంగీకరించినట్టు సమాచారం. అంటే, దాదాపు ఫిఫ్టీ పర్సంట్ డీల్ ఒకే అయినట్టే. అందుకే -పరశురామ్ మనసుపెట్టి కథపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పడితే పరశురామ్ స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి వెళ్లిపోవడం ఖాయం.