ఉత్సాహంగా చైతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మజిలీ చిత్రంతో దర్శకుడు శివ నిర్వాణ ఇచ్చిన విజయం చైతూలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మజిలీ నిలచింది. అంతేకాదు, వసూళ్లపరంగా ఓవర్సీస్‌లోనూ ఇంకా ఈ సినిమా తన హవా చూపిస్తుండటంతో -నాగచైతన్య కొత్త కథలపై మరింత ఫోకస్ పెంచాడు. ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో చైతూ ఓ సినిమా చేసే చాన్స్ ఉందన్న టాక్ ఫిల్మ్‌నగర్‌లో బలంగా వినిపిస్తోంది. ఆర్‌ఎక్స్ 100 భారీ సక్సెస్ తరువాత అజయ్ భూపతితో సినిమాలు చేయడానికి కొత్త హీరోలు చాలామందే పోటీపడ్డారు. ఆక్రమంలో రామ్ పోతినేనితో అజయ్ చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. వెంటనే బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో సినిమా చేయాలనుకున్నాడు అజయ్. దానిపైనా ఓ స్పష్టత రాకముందే -అన్నపూర్ణా కాంపౌండ్‌లోకి అజయ్ అడుగుపెట్టినట్టు చెబుతున్నారు. చైతూ హీరోగా యాక్షన్ నేపథ్యంలో ఒక సినిమా చేసే చాన్స్ ఉందని అంటున్నారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది