అలీ.. రంగుపడుద్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రై.లి పతాకంపై అలీ లీడ్‌రోల్ పోషిస్తున్న చిత్రం -రంగుపడుద్ది. ధన్‌రాజ్, సుమన్‌శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావులతో రూపొందుతున్న చిత్రానికి ఎస్ శ్యామ్‌ప్రసాద్ దర్శకుడు. మేలో విడుదలవుతున్న చిత్రానికి తాగాజా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంలో ధన్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇదే మనీషా బ్యానర్‌లో బ్లాక్‌బస్టర్ ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగుపడుద్ది డైలాగ్‌నే ఇపుడు టైటిల్‌గాపెట్టి కామెడీ హారర్‌ను తెరకెక్కిస్తున్నారన్నారు. రెండు గ్యాంగుల మధ్య నడిచే కథను ఔట్ అండ్ ఔట్ కామెడీతో తెరకెక్కించారు దర్శకుడు శ్యామ్‌ప్రసాద్ అన్నారు. దర్శకుడు శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ చాలాకాలం తరువాత ఇదే బ్యానర్‌లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. పూర్తిస్థాయి హారర్ కామెడీతో తెరకెక్కిన చిత్రం అందరినీ అలరిస్తుందన్నారు. నిర్మాత మహేష్ రాఠి మాట్లాడుతూ క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు చిన్నపిల్లల్ని సైతం సినిమా ఎంటర్‌టైన్ చేస్తుందన్నారు.