సీన్‌లోకి నయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ 167వ సినిమా. పైగా మురుగదాస్ దర్శకత్వం. దర్బార్ అంటూ డిఫరెంట్ టైటిల్. సెట్స్‌పైనున్న సినిమా హైట్స్‌ను అందుకుంటోంది. చాలాకాలం తరువాత ఈ సినిమా కోసం రజనీతో జోడీ కడుతోంది నయనతార. కొద్దిరోజులుగా రజనీకాంత్ తదితరులపై ముఖ్య సన్నివేశాలను షూట్ చేస్తున్న దర్శకుడు మురుగదాస్, తాజాగా రజనీ-నయన్ కాంబినేషన్ సీన్స్ షూట్ చేసేందుకు సిద్ధమయ్యాడట. మంగళవారం నుంచి నయన్ షూటింగ్‌లో జాయినైందని సమాచారం. రజనీ -నయన్ కెమిస్ట్రీని ఆడియన్స్ రుచి చూసి చాలాకాలమే అయ్యింది. సో, వీళ్ల కాంబినేషన్‌పై రజనీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్బార్‌లో రెండు పాత్రలు పోషిస్తున్న రజనీ అటు పోలీస్‌గా, ఇటు సామాజిక సేవకుడిగా కనిపిస్తాడని టాక్. మురుగదాస్ సినిమా కనుక సామాజిక ఇతివృత్తంతో సోషల్ మెసేజ్ ఓరియంటెండ్ చిత్రమే ఉంటుందన్న అంచనాలు లేకపోలేదు. గత సంక్రాంతికి పేటతో ఓ ఊపు ఊపేసిన రజనీ, దర్బార్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా తెచ్చే అవకాశాలు లేకపోలేదు.