డబుల్ డిస్కో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న మాస్ రాజా రవితేజకు ఇప్పుడు సరైన హిట్టుపడాలి. లేదంటే కెరీర్ మరింత రిస్క్‌లో పడే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే మాస్‌రాజా సక్సెస్ కోసం తపిస్తున్నాడు. ఏడాది గ్యాప్ తరువాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినా, ఒక్క హిట్టు మాత్రమే చేతికందింది. తరువాత చేసిన సినిమాలన్నీ రివర్సే అయ్యాయి. దీంతో డిస్కోరాజా అంటూ భిన్నమైన ప్రయత్నం చేస్తున్నాడు రవితేజ. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అయితే ఈ రెండు పాత్రలకు విచిత్రమైన డిజార్డర్ ఉంటుందట. ఆ డిజార్డర్ ద్వారా కామెడీ బాగా పండుతుందని అంటున్నారు. సినిమా మొత్తం ఈ విషయంచుట్టే తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. పాయల్‌రాజ్‌పుత్, ప్రియాంకా జువాల్కర్, నభ నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పుడు రవితేజ ఆశలన్నీ డిస్కోరాజాపైనే ఉన్నాయి. అందుకే ఈ సినిమాతో ప్రయోగం చేస్తున్నాడు. అటు దర్శకుడిగా విఐ ఆనంద్‌కు సరైన హిట్టుకావాలి. భిన్నమైన కథలను టచ్ చేస్తూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు విఐ ఆనంద్. రవితేజ ఈ సినిమాతోపాటు మాస్ దర్శకుడు వినాయక్‌తోనూ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.