శృతి రీ ఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ గ్లామర్ భామ శృతిహసన్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న టైంలోనే సినిమాలు వదిలేసి, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్ అంటూ షాకిచ్చింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోవాలని కన్న కలలన్నీ కల్లలే అవడంతో క్రమంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బాలీవుడ్ అంత ఈజీ కాదని అర్థం చేసుకున్న శృతి, తాజాగా సౌత్‌పై మళ్లీ ఫోకస్ పెట్టింది. తాజాగా తమిళ సినిమా ప్రారంభంలో హీరోతో కనిపించిన శృతి షాకిచ్చింది. విజయ్ సేతుపతి తాజా ప్రాజెక్టులో అతనికి జోడీగా శృతి కనిపించనుంది. లాభం టైటిల్‌తో వస్తున్న తాజా చిత్రంతో శృతి మళ్లీ చెలరేగిపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి క్రేజ్ మామూలుగా లేదు. రజని, కమల్, విజయ్, అజిత్‌ల తరువాత ఆ రేంజ్ స్టార్‌డమ్‌ను అందుకున్నాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం నాలుగు చిత్రాలతో విజయ్ సేతుపతి బిజీగా ఉన్నాడు. ఇక గ్లామర్ భామగా సౌత్‌లో మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న శృతిహాసన్ సినిమాలకు దూరమవ్వడంతో ఆమె అభిమానులు ఒకింత నిరుత్సాహపడ్డారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న టైంలో కావాలని సినిమాలకు దూరమవ్వడం ఎందుకంటూ చాలామంది చెప్పినా శృతి వినలేదు. అయితే తాను అనుకున్నట్టుగా మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఎన్ని చేసినా సినిమా హీరోయిన్‌గా ఇమేజ్ దక్కితే ఆ రేంజ్ వేరని తెలుసుకుందో ఏమో అందుకే రీ ఎంట్రీ ఇచ్చిందంటూ కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.