ఈసారి ఎన్టీఆర్‌తో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్సీ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఓ ఫెయిల్యూర్ క్రికెటర్ నేపథ్యంలో తెరకెక్కిన జెర్సీ జెన్యూన్ ప్రయత్నం అంటూ ప్రశంసలు దక్కడమే కాదు ఈ సినిమా టాలీవుడ్‌లో ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుందని అంటున్నారు. ఇక జెర్సీ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి అవకాశాల క్యూ కట్టాయి. ఆయనతో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. దిల్‌రాజు, రాజవౌళి, ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తడంతో ఈ దర్శకుడు అప్పుడే నెక్స్ట్ సినిమా ప్రయత్నం మొదలుపెట్టినట్టు తెలిసింది. తాజాగా ఈ దర్శకుడు ఎన్టీఆర్‌తో కథ చర్చలుకూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్‌ను కలిసి ఓ లైన్ కూడా చెప్పాడట. లైన్ నచ్చడంతో ఫుల్‌స్క్రిప్ట్ సిద్ధం చేయమని ఎన్టీఆర్ చెప్పినట్టు ఫిలింవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా దర్శకుడు గౌతమ్ కూడా ఇకపై స్టార్ హీరోలతో చేసి తన రేంజ్ పెంచుకునే పనిలో ఉన్నాడట. ఆ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాకోసం కూడా రామ్‌చరణ్‌కోసం కూడా ఓ లైన్ సిద్ధంచేసాడని అంటున్నారు. చరణ్‌తో కలిసే విషయంలో గౌతమ్‌కు ఓ ప్రముఖ నిర్మాత సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ చరణ్‌తో ఈ దర్శకుడు కథ చెప్పి ఓకే చేయిస్తే.. ఆ సినిమాను ఈ నిర్మాతే నిర్మిస్తాడని టాక్. ఇక గౌతమ్ మాత్రం జెర్సీ ఇచ్చిన విజయాన్ని రిసీవ్ చేసుకునేందుకు ఇంకాస్త టైం పట్టేలా ఉందని అంటున్నాడు. కాబట్టి కాస్త బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. మరి ఎన్టీఆర్ లాంటి హీరోతో కథ ఓకే అయ్యాక ఈ దర్శకుడు ఖాళీగా ఎందుకు కూర్చుంటాడు చెప్పండి. ఆ బ్రేక్‌లోనే కథను సిద్ధంచేస్తాడు. మొత్తానికి జెర్సీ సినిమాతో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల లిస్ట్‌లో చేరిపోయాడు గౌతమ్ తిన్ననూరి. మరోవైపు జెర్సీ సినిమా రీమేక్ విషయంలో భారీ పోటీ నెలకొన్నదట.