కూలీగా వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలీ నెంబర్ 1 అప్పట్లో బంపర్‌హిట్. ఈ చిత్రంలో గోవిందా కామెడీ అభిమానుల్ని పీక్స్‌లో అలరించింది. దాదాపు పాతికేళ్ల తరువాత ఆ సినిమాని మరోసారి హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆగస్టునుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రాజెక్టు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ ‘ఇది మక్కీకి మక్కీ రీమేక్ కాదు. కేవలం అడాప్టేషనే. కాకపోతే ఒరిజినల్ స్క్రీన్‌ప్లే యధాతథంగా ఉంటుంది. కథలోని సన్నివేశాల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాం. గత 15ఏళ్లలో అలాంటి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని నేను చూడలేదు. ఆ సినిమా స్క్రీన్‌ప్లే నాకు చాలా ఇష్టం. అందుకే నటిస్తున్నా. ఆ సినిమాతో నేను నటించే సినిమాకి పోలికలు పెడతారని తెలుసు. అయినా ఛాలెంజింగ్‌గా తీసుకుంటా’ అంటున్నాడు. వరుణ్ ధావన్ నటించిన కళంక్ ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే.