సస్పెన్స్ థ్రిల్లర్.. స్టూవర్టుపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్కాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గూఢచారి ఫేమ్ ప్రీతిసింగ్ ప్రధాన పాత్రలో సత్యనారాయణ ఏకారి తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ -స్టూవర్టుపురం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న చిత్రాన్ని రంజిత్ కోడిప్యాక సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మా బ్యానర్‌లో నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాలు నిర్మించాం. స్టూవర్ట్‌పురం చిత్రాన్ని దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం రీరిక్డాంగ్ స్టేజ్‌లో ఉంది. మేలో విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ నర రూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు. అప్పుడు హీరోయిన్ వాళ్లను ఎలా డీల్ చేసిందన్న పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాం. రీరికార్డింగ్‌కు మంచి స్కోప్‌వున్న ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను నవనీత్‌చారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేస్తున్నాడు. ఈ సినిమా మా బ్యానర్‌లో మూడో చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుంది అన్నారు. మల్లికా, రవిరాజ్, భానుప్రసాద్, హర్ష నల్లబెల్లి, శివప్రసాద్, సాయిరామ్ దాసరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.