గోవాలో శరణం గచ్ఛామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ సినిమా టైటిల్ సాంగ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సినిమా మీద సామాజిక బాధ్యత వుందని, సమాజాన్ని బాగుచేయకపోయినా ఫర్వాలేదు గానీ, తప్పుదోవ పట్టించే విధంగా మాత్రం సినిమాలు చేయకూడదన్నారు. ప్రస్తుతం ఇలాంటి సినిమాలే వస్తున్నాయని, ఈ ధోరణి మారాలన్నారు. దర్శకుడు ప్రేమ్‌రాజ్‌లో ఏదో ఫైర్ కనిపిస్తోందని, అందరిలా వ్యాపారాత్మక ధోరణిలో కాకుండా సమాజానికి సందేశాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తాడని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో వున్న ఓ ప్రధాన సమస్యను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ సమస్యను ఒకవైపు మాత్రమే కాకుండా రెండు వైపులా చర్చిస్తున్నామని, మెసేజ్‌తోపాటు కమర్షియల్ అంశాలున్న చిత్రం ఇది అన్నారు. నిర్మాత మురళి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టాకీ పూర్తయింది. త్వరలోనే పాటల చిత్రీకరణ పూర్తిచేస్తామన్నారు.