సరదాగా చెప్పానంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజల్ అగర్వాల్ కెరియర్లో ‘సీత’ సినిమా ఓ గొప్ప ప్రాజెక్టు అవుతుందంటున్నాడు దర్శకుడు తేజ. కాజల్ లీడ్‌రోల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కించిన చిత్రం -సీత. కొద్ది గ్యాప్ తరువాత తేజ దర్శకత్వం వహించిన సినిమా 24న థియేటర్లకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిత్రబృందం బిజీ అయ్యింది. ఈ సందర్భంలో తేజ మీడియాతో మాట్లాడుతూ ‘సీత కథ సిద్ధం చేసిన తరువాత క్యాజవల్‌గా కాజల్‌కి చెప్పా. ఆ పాత్ర తనే చేస్తానంటూ పట్టుబట్టింది. ఎప్పటికైనా తనతోనే సీత పాత్ర చేయించాలని తేల్చి చెప్పేసింది కూడా. కాజల్‌ని ఫిక్సయిన తరువాత, చాలామంది హీరోలకు కథ చెప్పాను. లీడ్‌రోల్ చేస్తున్న సీనియర్ హీరోయిన్‌తో జోడీ కట్టడానికి యువ హీరోలు ఆసక్తి చూపలేదు. కథ విన్న వెంటనే ఓకే చెప్పింది ఒక్క సాయిశ్రీనివాస్ మాత్రమే. నా కథపై కాజల్ చాలా నమ్మకంగా ఉంది. ఆమె నమ్మకం వమ్ముకాదు. సీత సినిమా ఆమె కెరిర్‌లో మంచి సినిమాగా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’ అంటున్నాడు తేజ. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్, అభిమన్యుసింగ్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.