ఛాన్స్‌కోసం.. చరిష్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకులకు, పరిశ్రమ వర్గాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు సోనిచరిష్టా. ఏ అగ్ర హీరోయిన్‌కు తీసిపోని అందం, అభినయం, నాట్యం కలిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ జాతీయ నటిగా పేరు గడించాలనే సంకల్పంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఓ చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి (కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి), సోనీ చరిష్టా, కళాతపస్వి కె.విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఫరీన్ ఫాతిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ టైటిల్ ఇద్దరు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, గోవా, థాయిలాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న ఇద్దరు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు థ్రిల్లింగ్ అంశాలతో సాగే హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఇద్దరు చిత్రం తనకు మరింత పేరు తెస్తుందని ఆశిస్తున్నానని సోనీ చెబుతోంది. ఈ చిత్రమే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నానని, తెలుగులో త్వరలోనే ఒక మంచి సినిమాకు సైన్ చేయనున్నానని సోనీ తెలిపారు.