ఒక్కడూ చావకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ -సువర్ణసుందరి. ఎంఎస్‌ఎన్ సూర్య దర్శకుడు. చిత్రానికి సంబంధించి సోమవారం విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోందన్న కానె్సప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. ‘సువర్ణ సుందరి’ విగ్రహం కారణంగా సంభవించే సంఘటనలతో ట్రైలర్‌ను కట్ చేశారు. రాణి పాత్రలో సాక్షిచౌదరి శత్రువును కత్తితో పొడిచి పైకి లేపడం, ‘ఇకపై ఒక్కడూ చావకూడదు’ అంటూ సాయికుమార్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హారర్ ఎలిమెంట్‌ను హైలెట్ చేస్తూ సాయికార్తీక్ అందించిన నేపథ్య సంగీతం బావుంది. కోట శ్రీనివాస్, నాగినీడు, సత్యప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 31న తెలుగు, కన్నడలో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత ఎఎల్ లక్ష్మి మాట్లాడుతూ -సువర్ణ సుందరికి మంచి మీడియా సపోర్ట్ లభించిందని, అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే సినిమా పూర్తి చేసినా అవుట్‌పుట్ బాగా వచ్చిందన్నారు. దర్శకుడు ఎంఎస్‌ఎన్ సూర్య మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు చేయడం దర్శకుడిగా సంతృప్తినిచ్చిందన్నారు. స్టోరీ డిమాండ్ మేరకు భారీ బడ్జెట్‌తోనే సినిమా తెరకెక్కించామని, అరుంధతి, మగధీర తరహా సినిమా అనుభూతి కలుగుతుందన్నారు. సినిమాలో కామెడీని ఎక్స్‌పెక్ట్ చేయొద్దని, చివరి వరకూ సినిమా థ్రిల్లింగ్‌గా సాగుతుందన్నారు. ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పదం తరతరాలను ఎలా వెంటాడిందన్నదే కథాంశమని అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి అంతా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు.