ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేయాలని అడుగుతున్నారు. అయితే ముందు కథ నాకు నచ్చాలి. అపుడే చేస్తానంటోంది అందాల చందమామ కాజల్. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీకట్టిన చిత్రం సీత. సోనూసూద్, మన్నారా చోప్రా కీలక పాత్రల్లో నటించారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ ముచ్చట్లు.
మానసికంగా బలమైన అమ్మాయి పాత్ర నాది. తేజ బాగా డిజైన్ చేశారు. ఆయన దర్శకత్వంలో నటించిన ప్రతిసారీ నాకు నటనకు స్కోప్ వుండే పాత్ర దక్కింది. నేటితరం అమ్మాయిలను రిప్రజెంట్ చేస్తా. నా పాత్రలో స్వార్థం, కలలను సాధించాలనే తపన కనిపిస్తాయ.
సీత పాత్ర కోసం హార్డ్‌వర్క్ చేశాను. పాత్ర కోసం చాలా పుస్తకాలు చదవడమే కాదు చాలామందిని పరిశీలించాను. ఓరకంగా చెప్పాలంటే సాహసాలే చేశా. ఆ సన్నివేశాల్లో గాయపడ్డాను కూడా. అవేంటే స్క్రీన్ మీద చూడండి.
హీరో శ్రీనివాస్‌తో ఇదివరకే ‘కవచం’ చేశాను. సో, ఈ ప్రాజెక్టు ఈజీ అయ్యింది. అతని పాత్ర కూడా చాలా బావుంటుంది.
తేజగారు ఎప్పుడో కథ చెప్పారు. కానీ కాల్షీట్స్ లేకపోవడంతో లేటైంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సమయంలో నాతోనే సినిమా తీయాలని తేజను గట్టిగానే అడిగాను. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను సెట్స్‌కు తీసుకెళ్లాం.
కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేయాలని అడుగుతున్నారు. అయితే కథ ముందు నాకు బాగా నచ్చాలి. అపుడే చేస్తాను. టాప్ హీరోలు, యంగ్ హీరోలతో నటిస్తున్నానంటే కారణం ఈ రంగంపై నాకున్న ఇష్టమే కారణం.
జూన్‌లో భారతీయుడు 2 సెట్స్‌కు వెళ్లబోతోంది. శర్వానంద్‌తోపాటు జయం రవి సినిమాలూ చేస్తున్నా. అలాగే మరో సినిమా చర్చల దశలో వుంది. త్వరలో అనౌన్స్ చేస్తాను.