సర్‌ప్రైజ్ చేస్తాడట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుబలి 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా వున్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రేపటినుండి ప్రభాస్ చిత్ర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టనున్నారు. ఇందులో భాగంగా సాహో సర్‌ప్రైజ్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ఇస్తున్నట్టు ప్రభాస్ పోస్ట్ చేశాడు. యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1కి ఇప్పటికే ఇండియా మొత్తం క్రేజ్ వచ్చింది. అలాగే షేడ్స్ ఆఫ్ సాహూ 2కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ స్టైలిష్ లుక్స్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేకింగ్ హైలెట్‌గా నిలుస్తున్నాయి. రన్ రాజా రన్ చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు సుజిత్‌తోపాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ దర్శకుల త్రయం శంకర్- ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.