మీరే గ్రేడింగ్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీత చిత్రంలో రఘురామ్ అనే చాలెంజింగ్ పాత్రలో కనిపిస్తా. సినిమా చూశాక నా పాత్రకు ఆడియన్స్ తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా నటుడిగా నాకో మలుపు. మంచి గౌరవాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నా -అన్నాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కాజల్ అగర్వాల్ జోడీగా, మన్నారా చోప్రా మరో హీరోయిన్‌గా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం నిర్మించిన సినిమా సీత. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక గీతంలో నర్తించారు. మే 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందటానికి జీవితాంతం కష్టపడతా. ప్రాణ సమానమైన సినిమా కోసం ఏమైనా చేస్తా. తేజలాంటి ఫ్యానేటిక్ ఫిల్మ్‌మేకర్‌ను ఇంతవరకూ కలవలేదు. ఇలాంటి పాషన్డ్ డైరెక్టర్స్ అరుదు. ఇక కథ విషయానికొస్తే, మహిళలకు పురుషులకంటే మేధస్సు ఎక్కువని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత తెరకెక్కింది. టైటిల్ రోల్ చేసిన కాజల్ కష్టపడ్డారు. సోనూసూద్ ఈ సినిమాకు ప్రాణం పెట్టారు అన్నారు. లీడ్ రోల్ చేసిన కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ నెర్వస్ ఫీలవుతున్నా. సీత సినిమాతో చాలా నేర్చుకున్నా. ఇదో బ్రిలియంట్ జర్నీ. నన్ను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాత, నా మెంటార్ తేజకు ధన్యవాదాలు. తేజ లేకుంటే ఈ స్టేజీపై ఉండేదానే్న కాదు. నన్ను ఆదరిస్తున్న ఆడియన్స్‌కి జీవితాంతం రుణపడి వుంటా అన్నారు. దర్శకుడు తేజ మాట్లాడుతూ తనకు జడ్జిమెంట్ సరిగారాదని, అందుకే సీత చిత్రంతో ఆడియన్స్‌ని జడ్జిమెంట్ అడుతున్నానన్నారు. సినిమా పూరె్తైన తరువాత పరుచూరి బ్రదర్స్‌కి చూపించి, వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి సరిచేశాం. హీరో శ్రీనివాస్ బాగా చేశాడు. అతన్ని వేరే స్టయిల్‌లో చూపించా. మీకు నచ్చుతుందనే నా నమ్మకం. హీరోయిన్ కాజల్, సోనూసూద్ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్లందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమోకానీ, 24న సినిమా చూసి మీరే నాకు గ్రేడింగ్ ఇవ్వండి అన్నారు. కార్యక్రమంలో సోనూసూద్, మన్నారాచోప్రా మాట్లాడారు.