విక్రమ్ కొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాన్ విక్రమ్. ఈ పేరంటేనే పాత్రలకు స్పెషల్. ఏ పాత్రలోనైనా తనదైన శైలి ప్రదర్శించి ఆడియన్స్‌ని మెప్పించగల నటుడు. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న విక్రమ్‌కి ఇటీవలి కాలంలో సరైన హిట్టు ఒక్కటీ దక్కలేదు. రేసులో ఒకింత వెనకపడిన చియాన్ -తన 58వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త ప్రాజెక్టుకు ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్’లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చియాన్ స్టామినాకు తగినట్టుగా భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ఆగస్టులో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టి వచ్చే వేసవికి సీనిమాను స్క్రీన్స్ తేవాలన్నది చిత్రబృందం ప్రణాళిక. ప్రీప్రొడక్షన్స్ దశలోవున్న ప్రాజెక్టుకు సంబంధించి ఇతర నటీనటుడు, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటించనున్నారు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్టు చెబుతూ, వైవిధ్యమైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.