ఒప్పుకోలేని పాత్రే చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుడు శీనుతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. నచ్చిన పాత్ర ఏదైనా చేస్తానంటున్న ఈ హీరో తాజాగా సీతతో కలిసి వస్తున్నాడు. గ్లామర్ హీరోయిన్ కాజల్ టైటిల్ రోల్‌లో
శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం సీత. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 24న
విడుదలకానుంది. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాస్ ముచ్చట్లు

సినిమా బాగా వచ్చింది. చివరి అరగంట మంచి ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. అంతకుముందంతా నవ్వులే నవ్వులు. 20ఏళ్లపాటు సోషల్ పొల్యూషన్‌కి దూరంగా పెరిగిన అబ్బాయి జనారణ్యంలోకి వచ్చి ఓ అమ్మాయికి సపోర్ట్‌గా నిలుస్తాడు. డబ్బే సర్వస్వం అనుకునే ఆ అమ్మాయికి, నిదానమే మేలనుకునే ఈ అబ్బాయికి మధ్య జరిగిన కథే ఇది.
చాలా వేరియేషన్స్‌తో నా పాత్ర కొత్తగా ఉంటుంది. తేజ చెప్పిన రెండు కథలో మరొకటి మా నాన్నకు నచ్చినా, నన్ను నేను ప్రూవ్ చేసుకోడానికి ఈ కథను ఎంచుకున్నా. తొలి సినిమాల ఒకింత కామెడీ చేశాను. ఆ తరువాత మళ్లీ కామెడీ చేయలేదు. ఈ సినిమాలో మళ్లీ కామెడీ చేయించారు తేజ. ఆయనతో పని చేయడం స్వీట్‌గా అనిపించింది. ఎందుకంటే మంచి ఇన్‌పుట్స్ ఇస్తారు. ఎలా చేస్తే బావుంటుందో ఆలోచించుకోమంటూ తేజ ఇచ్చిన ఆప్షన్లు నాకు చాలా నేర్పించాయి. ఇకపై సినిమాల విషయంలో ఎలావుండాలో ఆయన దగ్గరే నేర్చుకున్నా.
లీడ్‌రోల్ సీత పాత్రలో కాజల్ కనిపిస్తుంది. తన పాత్ర సీరియస్. తేజ కథ చెప్పే టైంలోనే కాజల్‌ను ఎంపిక చేసినట్టు చెప్పారు. సీనియర్ అయిన కాజల్ ఈ పాత్రలో నటించటం చాలా అవసరం. ఆ పాత్రకున్న షేడ్స్ అలాంటివి. లేడీస్ టైటిల్ ఎందుకంటూ నన్ను చాలామంది ఫోర్స్ చేశారు. కానీ, ఈ కథకు ఆ టైటిల్ ఆప్ట్. లేడీ ఓరియంటెడ్ టైటిల్స్‌కి చాలామంది ఒప్పుకోరట. నేను ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఉందంటూ కొందరు ఫోన్లు కూడా చేశారు.
సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. పాత్రల చిత్రీకరణ, కాంబోడియా లొకేషన్లు, కథ, కథనం.. ఒకటేంటి చాలానే. అందులో ఓఓ అని వెరైటీ శ్లాంగ్‌లో నేను చెప్పే ఊతపదం ఒకటి అందరికీ నచ్చుతుంది. అలాగే సోనూసూద్ ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్. మా సంస్థలో గతంలో ఆయన కందిరీగ చేశారు. అప్పుడే ఆయనతో మంచి పరిచయం. ఈ సినిమాతో మరింత క్లోజయ్యాం. జనరల్‌గా ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు. కానీ, సోనూసూద్ ఇప్పుడు మంచి మిత్రుడయ్యాడు.
ప్రస్తుతం నేను చేస్తున్న రాక్షసుడు సినిమా పూర్తి కావొచ్చింది. నాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే హిందీ కోసం కాస్త భిన్నంగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నా. హిందీలో బన్నీవి, నావి సినిమాలు ఎక్కువమంది చూస్తున్నారు. భగవంతుడు హిందీ మార్కెట్ క్రియేట్ చేసినందుకు సంతోషిస్తున్నా. కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. రాక్షసుడు మాత్రం జూలైలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.

-శ్రీనివాస్ ఆర్ రావ్