మహర్షి -2?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహర్షితో హిట్టందుకున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దానికి సీక్వెల్ చేస్తున్నాడనుకోవద్దు. సిల్వల్ జూబ్లీ సినిమాను హిట్ చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లితో మాత్రం సెకెండ్ ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాడు. మహర్షి భారీ విజయంతో హ్యాపీగావున్న మహేశ్, అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడన్నది లేటెస్ట్ టాక్. మరో మంచి కథను సిద్ధం చేసుకోమంటూ దర్శకుడు వంశీకి ఇప్పటికే ప్రామిస్ కూడా చేశాడని చర్చించుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ టైంలోనే దర్శకుడు వంశీని హీరో మహేశ్ ఆకాశానికెత్తేశాడు. కథను బతికించేందుకు తనకోసం చాలాకాలం ఎదురు చూశాడంటూ ధన్యవాదాలూ చెప్పాడు. ఇప్పుడు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మరో చాన్స్ ఇస్తానన్నాడట. తనకు హిట్టించిన దర్శకులకు మళ్లీ చాన్స్ ఇవ్వడమన్నది మహేశ్ రొటీన్ స్టయిలే. ‘ఒక్కడు’ హిట్టిచిన గుణశేఖర్‌తో అర్జున్, సైనికుడు సినిమాలు చేశాడు. ‘అతడు’లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఖలేజా చేశాడు. ‘పోకిరి’లాంటి సెనే్సషనల్ హిట్టిచ్చిన పూరితో బిజినెస్‌మేన్, ‘శ్రీమంతుడు’వంటి బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చిన కొరటాల శివతో ‘్భరత్ అను నేను’ ప్రాజెక్టులు చేశాడు. ఇప్పుడు ‘మహర్షి’తో మంచి హిట్టిచ్చిన వంశీ పైడిపల్లితో మరో ప్రాజెక్టుకు ప్రామిస్ చేశాడని అంటున్నారు. మహర్షి విజయం సాధించడమే కాదు, ఎమోషనల్‌గా తనని ప్రేక్షకుల హృదయాలికి చేర్చిందన్న భావన మహేశ్‌లో ఉంది. ఈ కారణంగానే మరో కథను రెడీ చేయమని వంశీకి చెప్పినట్టు ఫిల్మ్‌నగర్ చర్చించుకుంటోంది. కమిటైన సినిమాలు కంప్లీట్ చేసేసి -మళ్లీ వంశీతో మహేష్ ఓ సినిమా చేస్తాడన్న మాట.