పాటల్లో డిసెంబర్ 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండలరావు, పోసాని కృష్ణమురళీ, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీ గౌతమ్ క్రియేషన్స్ పతాకంపై జి.కొండలరావు దర్శకత్వంలో జి.లక్ష్మణరావు నిర్మిస్తున్న చిత్రం డిసెంబర్ 31. ఈ చిత్రం ఇటీవలే తెలుగు ఫిలిం ఛాంబర్‌లో అత్యంత వైభవంగా ఆడియో విడుదల అయింది. ఈ సందర్భంగా దర్శకుడు జి.కొండలరావు మాట్లాడుతూ డిసెంబర్ 31 ఏం జరిగిందన్న కథాంశంతో రూపొందించాము. ఈ చిత్రంలో మంచి కథ. మంచి కథనం మన తెలుగు ప్రేక్షకులకు కావలసిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు బోలే చాలా మంచి పాటలను అందించారు. ముఖ్యంగా డిసెంబర్ 31న వైజాగ్‌లో ప్రతిసారి ఎంతోమంది చనిపోతున్నారు. అసలు వీళ్ళను ఎవరు చంపుతున్నారు. దీన్ని ఎలాగైనా ఛేదించాలని పోలీసులు ఒక రిక్రూట్‌మెంట్ రంగంలోకి దించుతారు. అతనే ఎసిపి రవీందర్. మంచి పవర్‌ఫుల్ పాత్ర ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మార్చి చివరివారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు. నిర్మాత జి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. మా ప్రాజెక్టును ఇంతబాగా రావడానికి సహకరించిన పాట శ్రీనుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాము. తప్పకుండా మా సంస్థకు మంచి పేరు వస్తుంది అని అన్నారు. సంగీత దర్శకుడు బోలే మాట్లాడుతూ.. ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని పాటలు ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా వుంటుంది. ముఖ్యంగా ఆర్.ఆర్ ఈ చిత్రానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ చిత్రం విడుదలయ్యాక నాకు మంచి పేరువస్తుంది అని అన్నారు.