ఫకీర్ వస్తున్నాడు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో ధనుష్.. అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. తమిళంలో హీరోగా పరిచయం అయిన ధనుష్ సౌత్‌లో అన్ని భాషల్లో పాపులర్ స్టార్ అయ్యాడు. ఆ తరువాత రంజనా సినిమాతో అటు బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదాచేసిన ధనుష్ ఆ తరువాత హిందీలో మరో రెండు సినిమాలు చేసాడు. అక్కడితో ధనుష్ ప్రయాణం ఆగలేదు. అతడి టాలెంట్‌కి మెచ్చిన హాలీవుడ్ ధనుష్‌కు వెల్కమ్ పలికింది. ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే సినిమాతో ధనుష్ హాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొమైన్ వ్యూర్తోలు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ సరసన హాలీవుడ్ హీరోయిన్స్ ఉమా తుర్మన్, అలెగ్జాండర్ దాడారియా నటిస్తుండగా ఎమోషనల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో పక్కిరి పేరుతో విడుదలచేస్తారట. జూన్ 21న భారీస్థాయిలో విడుదలకానున్న ఈ సినిమాపై అటు హాలీవుడ్‌తోపాటు ఇటు ధనుష్ అభిమానులు భారీ ఆశలుపెట్టుకున్నారు. ఇంతింతై వటుడింతై.. అన్నట్టు హాలీవుడ్ దాకా ఎదిగిన మన ఇండియన్ నటుడు ధనుష్‌కి తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే. కెనడియన్ రైటర్, కం డైరెక్టర్ కెన్ ష్కాట్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ హాలీవుడ్ హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.