అమ్మాయంటే అలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతాశ్రీ ఆర్ట్స్ పతాకంపై నేనే శేఖర్ దర్శకత్వంలో ఎలమంచిలి సిస్టర్స్ రూపొందిస్తున్న చిత్రం ‘అమ్మాయంటే అలుసా’. ఈ సినిమాకు సంబంధించిన పాటల సీడీని నటి కవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- అనాదిగా స్ర్తిలంటే అందరికీ వున్న అలుసు కథనంతో ఈ సినిమాను రూపొందించారని, ఇప్పటికీ చాలామంది అలుసు ధోరణితోనే ఆలోచిస్తుంటారని, మహిళలు హింసకు గురికాకూడదన్న ఆలోచనతో వారిని అలుసుచేయవద్దన్న కానె్సప్ట్‌తో ఈ సినిమాను రూపొందిచారని తెలిపారు. కథే హీరోగా మంచి సందేశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలు హైలెట్‌గా వచ్చాయని నిర్మాత కార్తీక్‌రెడ్డి తెలిపారు. స్ర్తిలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకాలన్న ఆలోచనతో ఈ సినిమాను రూపొందించామని, ఆడవాళ్లను అలుసుగా చూడకూడదనే కథనం ఈ సినిమాలో సరికొత్తగా వుంటుందని దర్శకుడు నేనే శేఖర్ తెలిపారు. ఏడు పాటలతో రూపొందించిన ఈ చిత్రానికి సంగీతం:కరుణాకర్, కెమెరా:జీవా, నిర్మాతలు:యలమంచిలి సిస్టర్స్, కథ, మాటలు, దర్శకత్వం:నేనే శేఖర్.