14న గేమ్ ఓవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ కథానాయిక తాప్సి ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరిట ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. యు/ఏ సర్ట్ఫికెట్‌ను పొందిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న విడుదలవుతోందని చిత్ర నిర్మాతలు ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. గతంలో ఈ సంస్థ సిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన లవ్ ఫెయిల్యూర్, విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన గురు వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇపుడు మరో ప్రయత్నంగా తాప్సి ప్రధానపాత్రలో ఈ గేమ్ ఓవర్‌ను నిర్మించటం సంతోషంగా వుందన్నారు నిర్మాత ఎస్ శశికాంత్. సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన చిత్రం మా గత చిత్రాలవలే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నయనతార కథానాయికగా తమిళనాట ఘనవిజయం సాధిచిన మయూరి వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణ్ దర్శకత్వంలో ఈ గేమ్ ఓవర్ రూపొందింది. కథానాయిక తాప్సీ మాట్లాడుతూ చిత్ర కథ విన్నప్పుడే సరికొత్తగా ఉందని, విజయం సాధించే చిత్రం అనిపించింది. ఆనందోబ్రహ్మ తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదన్నారు. గేమ్ ఓవర్ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా అలరిస్తుందని దర్శకుడు శరవణన్ అన్నారు.