గిరిజనులను ఆదుకునే మారాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భానుచందర్, జాన్, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా ఎ.వి.ఎం ఆర్ట్స్ పతాకంపై శివప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో పి.సుధాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘మారాజు’. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భానుచందర్ మాట్లాడుతూ- గిరిజనులకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వ సహయం సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో మరణాలకు చేరువ అవుతున్నారని, కొండలలో, నాగరికతకు దూరంగా వుండే వారికి వారి సమస్యలు ఎలా వుంటాయి అన్న కథనంతో ఈ చిత్రం రూపొందిస్తున్నారని తెలిపారు. తాను గిరిజన నాయకుడిగా నటిస్తున్నానన్నారు. అటవీ అధికారిగా అడవులలో వుండే గిరిజనులకు ఎలా సహాయం చేయాలి అన్న కథనంతో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనాలు పూర్తయ్యాయని, రెండు షెడ్యూళ్లల్లో సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని జాన్ తెలిపారు. సమాజానికి అవసరమైన కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో గిరిజనులు కూడా మనలో ఒకరే అని ఈ సినిమా చెబుతుందని, ఈ సినిమా అందరికీ నచ్చేలా రూపొందుతుందని దర్శకుడు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సాయికిరణ్, వౌనిక, పి.వి.రాజు తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాకు మాటలు: ప్రవీణ్, ఎడిటింగ్: దామోదర్, కెమెరా: ప్రసాద్, జానకిరామ్, సంగీతం: చిన్నికృష్ణ, నిర్మాత: టి.సుధాకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివప్రసాద్‌రెడ్డి.