శర్వా.. రణరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్‌లో దర్శకుడు సుధీర్‌వర్మ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్‌ను ‘రణరంగం’గా నిర్ణయించినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. రణరంగానికి సంబంధించి తొలి ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు. ‘గ్యాంగ్‌స్టర్’గా శర్వానంద్ పోషిస్తున్న పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో ఉంటుందన్నారు. 1990 నుంచి 2000 వరకూ పదేళ్లలో గ్యాంగ్‌స్టర్ అయన హీరో లైఫ్‌లో జరిగిన ఘటనల సమాహారమే చిత్ర కథాంశమని వెల్లడించారు.
దర్శకుడు సుధీర్‌వర్మ సినిమా శైలి వెరైటీగా ఉంటుందని, ‘రణరంగం’ కూడా అందుకే ఏమాత్రం తీసిపోదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రంలో ఎంతో నమ్మకంతో ఉన్నామన్నారు. కొత్త ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిత్రం షూటింగ్ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆగస్టు 2న సినిమా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై, సినిమాటోగ్రఫీ దివాకర్ మణి అందిస్తున్నారు.