సుప్రీమ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు రూపొందించిన చిత్రం ‘సుప్రీమ్’. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో సుప్రీమ్ ఆడియో సీడీని నటుడు చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. నాని, వరుణ్‌తేజ్ కలిసి సుప్రీమ్ థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌రావి పూడి మాట్లాడుతూ, అన్ని హంగులతో అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామని, యువతతోపాటుగా కుటుంబ ప్రేక్షకులు, పిల్లలకు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు. సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాలో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుంటాడని, రాశీఖన్నా పాత్రకు తగిన విధంగా హాస్యభరితంగా నటించిందని తెలిపారు. తమ సంస్థ నుండి వస్తున్న మరో సూపర్‌హిట్ మూవీగా సుప్రీమ్ నిలుస్తుందని నిర్మాత రాజు అన్నారు. సుప్రీమ్ అంటే అది తన మేనమామ చిరంజీవికి వర్తించే అంశమని, అలాంటి ఆ పేరుతో తాను నటించడం అంటే మొదట భయపడినా ఆ తరువాత మామయ్య ఇచ్చిన ధైర్యంతో నటించానని కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ అన్నారు. డైరెక్టర్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారని, నేను బాగా నటించాను అంటే ఆ క్రెడిట్ డైరెక్టర్‌కే చెందుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్, మలినేని గోపీచంద్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, రాశీఖన్నా, సంగీత దర్శకుడు సాయికార్తీక్, వరుణ్ తేజ్, నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.