పాటల గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంపట్ల ఎన్నో ఆశలతో గల్ఫ్‌కు వలస వెళ్లిన భారతీయుల కష్టసుఖాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గల్ఫ్’. పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రచారాన్ని విభిన్నంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాల్లో పాటలను, టీజర్‌ను విడుదల చేస్తున్నారు. మస్కట్‌లో తొలి పాటను, టీజర్‌ను విడుదల చేయగా, దుబాయ్‌లో రెండో పాటను మరో టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా మూడో పాటను కువైట్‌లో విడుదల చేశారు. ప్రవీణ ఇమ్మడి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అందరిలోనూ క్రేజ్ ఏర్పడిందని, మూడో పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ ఆలాప్స్ అందించగా, హైమత్ మోహనా భోగరాజు ఆలపించారు. కువైట్‌లోని రియా ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అకాడమీలో పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని నిర్మాత తెలిపారు. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి జూలైలో విడుదల చేస్తామని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:ఎస్.వి.శివరాం, సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:బి.బాపిరాజు, నిర్మాత:యక్కలి రవీంద్రబాబు, దర్శకత్వం:సునీల్‌కుమార్‌రెడ్డి.