ఆశలు తీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా పరిచయమై పలు చిత్రాల్లో నటించిన బెంగాలీ భామ మధురిమకు అందం, అభినయం బాగానే వున్నా సినిమా కమర్షియల్‌గా మాత్రం ఆమె కెరీర్‌కు ఉపయోగపడటంలేదు. వంశీ ‘సరదాగా కాసేపు’, ‘షాడో’ వంటి సినిమాలు చేసినా, మరోవైపు ఐటెం సాంగుల్లో అలరించినా కూడా పెద్దగా ఫలితం లేకపోయింది. దాంతో ఇక్కడ లాభం లేదనుకుని కన్నడ, హిందీల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఈమె నటించిన హిందీ చిత్రం ‘వన్ నైట్ స్టాండ్’. సన్నీలియోన్ నటించిన ఈ సినిమాలో మధురిమ నైరా బెనర్జీగా పేరు మార్చుకుని అందులో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్రలో అందాలు ఆరబోసి బోల్డు స్టెప్పు తీసుకున్న ఈ భామ ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. హిందీలో అయినా ఈమె ఆశలు తీరతాయో లేదో చూడాలి.

చిత్రం మధురిమ