క్రాంతిగా బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ -కెఎస్ రవికుమార్ కాంబోలో రానున్న తాజా ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోసారి ఖాకీ యూనిఫాంలో కనిపించనున్న బాలకృష్ణ -‘రూలర్’గా రానున్నాడంటూ నిన్న మొన్నటి వరకూ కథనాలు వినిపించాయి. తాజాగా టైటిల్ మారిందని తెలుస్తోంది. సి కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టుకు ‘క్రాంతి’ టైటిల్‌ను ఎంపిక చేసుకున్నారన్నది తాజా వార్త. టైటిల్ విషయంలో బాలకృష్ణ సైతం సంతృప్తి వ్యక్తం చేయడంతో -క్రాంతి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. బాలయ్యకు పోలీస్ పాత్రలు కొత్తకాదు. రౌడీ ఇన్స్‌పెక్టర్, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ చిత్రాలు వచ్చిన సమయంలోనే వరుస పోలీస్ పాత్రలు చేశాడు. ఆ తరువాతి చిత్రాల్లోనూ ఏసీపీ, డీసీపీ పాత్రల్నీ పోషించాడు. అయితే, ఈసారి మాత్రం ప్రస్తుత ట్రెండ్ ప్రకారం నెగెటివ్ షేడ్స్ డైమన్షన్‌లో బాలయ్య పాత్రను దర్శకుడు రవికుమార్ తీర్చిదిద్దినట్టు టాక్ వినిపిస్తోంది. గత ఏడాది బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైసింహా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రవికుమార్, ప్రస్తుతం కథానాయికల ఎంపికలో బిజీగా ఉన్నాడట. సెట్స్‌పైకి ఎప్పుడెళ్లేదీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.