కమల్ ‘అమ్మా నాన్న ఆట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్ హీరోగా త్రిష, మధుశాలిని హీరోయిన్లుగా రాజేష్ ఎం.శెల్వ దర్శకత్వంలో రూపొందిన ‘చీకటి రాజ్యం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ఇదొక విభిన్నమైన చిత్రం. అందరం కష్టపడి పనిచేశాం. ఇలాంటి చిత్రాల్ని ఆదరించకపోతే ఇలాంటి నేపథ్యంతో రూపొందే సినిమాలు రావడానికి మరో పదేళ్లు పట్టేది. మరో చరిత్ర సినిమా తర్వాత ఎంత సంతృప్తి పొందానో ఈ సినిమా విజయం పట్ల అలాంటి ఆనందమే వుంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ సంతోష సమయంలో మరో చిత్రాన్ని ప్రకటిస్తున్నాను. రాజ్‌కమల్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందనుంది. మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అమల కూడా నటించనుంది. ఈ చిత్రానికి ‘అమ్మా నాన్న ఆట’ అనే టైటిల్‌ను నిర్ణయించాం. ఇదొక ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ డ్రామాగా ఉంటుంది. ఆరునెలల్లో చిత్రాన్ని పూర్తిచేస్తాం అన్నారు. అమల మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమకు మరో కొత్త కానె్సప్ట్‌ను పరిచయం చేసిన చిత్రం ‘చీకటిరాజ్యం.’ మంచి కథా కథనంతో తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అన్నారు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం మా టీమ్ సహకారమే. అలాగే ఈ విజయం కమల్‌గారికే చెందుతుంది అన్నారు. మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పంపిణీ చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. రెండు రాష్ట్రాల్లో 231 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేశాం. మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. రేపటి నుండి మరో 30 థియేటర్లవరకు పెంచుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్బూరి రవి, మధుశాలిని పాల్గొన్నారు.