బాలీవుడ్‌లో చేయాలని వుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయిస్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి ఆ తరువాత కొన్ని చిత్రాలకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేసి రవితేజ నటించిన ‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఎస్.ఎస్.తమన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా టాప్ సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్న చిత్రం ‘సరైనోడు’. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. ‘సరైనోడు’ చిత్రం ఈనెల 22న విడుదలవుతున్న సందర్భంగా తమన్‌తో ఇంటర్వ్యూ..
--

* వరుసగా బన్నీతో చేస్తున్నారు?
- బన్నీతో పనిచేస్తుంటే తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. కథకు తగ్గట్టుగా పాట సిట్యుయేషన్ కరెక్టుగా వుండాలని చూసుకుంటాడు. ముఖ్యంగా డాన్సు, లిరిక్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు. ఈ విషయాలపై మంచి కమాండ్ వున్న వ్యక్తి బన్నీ.
* మీ ట్యూన్స్ రిపీట్ అవుతున్నాయనే వార్తలొస్తున్నాయి?
- నా దగ్గర రెడీమేడ్ ట్యూన్స్ వుంటాయని అనుకుంటారు కానీ, అలాంటివి ఏమీ వుండవు. ఒక సినిమా కోసం చేసిన ట్యూన్స్ ఆ డైరెక్టర్‌కు నచ్చకపోతే పక్కన పెట్టేస్తాను. అవే ట్యూన్స్ వేరే దర్శకుడికి నచ్చుతాయి కానీ ఆ ట్యూన్స్‌ని వినిపించడానికి ఇష్టపడను.
* ఈమధ్య సింగర్‌గా కూడా మీరే పాడేస్తున్నారు?
- నేను మ్యూజిక్ అందించిన సినిమాలో నా వాయిస్ వుండాలనుకోను. కానీ, ఆ పాటకు నా వాయిస్ బాగుండి, దర్శకుడికి నచ్చితే అలాగే పాడతాను.
* బోయపాటి శ్రీనుతో పనిచేయడం?
- బోయపాటి శ్రీను మొదటి చిత్రం ‘్భద్ర’ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించాడు. ఆ సినిమాకు నేను కీబోర్డు ప్రోగ్రామింగ్ చేశాను. ఇన్ని రోజులకు ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా వుంది. మొదట్లో బోయపాటి గారి సినిమా అంటే భయపడ్డాను. కానీ వర్క్ మొదలుపెట్టిన వారంలోగా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.
* ఐటెం సాంగ్ కోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు?
- ఐటెం సాంగ్స్ చేయడం నిజంగా కష్టమైన పనే. మిగిలిన పాటలు సులభంగానే చేయచ్చుకానీ, ఐటెం సాంగ్ అనేది ఒకరకంగా టార్చరే. దేవిశ్రీ బన్నీకోసం ‘రింగ రింగ’, ‘టాపు లేచిపోద్ది’ వంటి పాటలిచ్చాడు. దాంతో నేను బన్నీకి ఎలాంటి సాంగ్స్ ఇస్తానో అనే ప్రెజర్ వుంటుంది. కానీ ముందుగానే ప్రిపేర్ అవ్వడంవల్ల కొంచెం ఈజీగా అయింది.
* ఎలాంటి సినిమాలకు సంగీతం అందించాలంటే ఇష్టం?
- నాకు వ్యక్తిగతంగా థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చేయడం చాలా ఇష్టం. ప్రస్తుతానికి ఆ తరహా సినిమాలు చేయడంలేదు. మంచి కానె్సప్టుతో వస్తే చేస్తా.
* పాటలు రీమిక్స్ చేయడానికి ఇష్టపడతారా?
- ఓ పాటను రీమిక్స్ చేస్తే చాలా కంపారిజన్స్ వస్తాయి. పది సినిమాలకు వచ్చే టెన్షన్ ఆ ఒక్క పాటకే వస్తుంది. ‘నాయక్’లో వచ్చిన శుభలేఖ రాసుకున్న పాటను రీమిక్స్ చేసినపుడు చాలా టెన్షన్ పడ్డా. నిజానికి రీమిక్స్ చాలా కష్టం.
* నటుడిగా అడుగులేస్తున్నారా?
- అట్లీ అసోసియేట్ దగ్గర స్టోరీ విన్నా. ఆ కథతో ‘బాయిస్-2’ ప్లాన్ చేస్తున్నాం. మరో రెండు నెలల్లో అది సెట్ అవుతుంది. ఆ సినిమాకు మ్యూజిక్ కూడా నేనే చేయాలనుకుంటున్నా.
* బాలీవుడ్‌కెళతారని అంటున్నారు?
- నాకైతే బాలీవుడ్‌లో సినిమా చేయాలనే ఆలోచన వుంది. కానీ, అక్కడి దర్శకులతో కమ్యూనికేషన్ లేదు. కానీ ఇక్కడినుండి బాలీవుడ్ వెళ్లే సినిమాలకి మ్యూజిక్ చేయాలనుకుంటున్నా.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం మనిషి జీవితంలో ప్రేమను ఎలా డివైడ్ చేస్తామనే దానిపై ఒక ఆల్బం చేస్తున్నాను. మూడు పార్ట్‌లుగా వుండే ఈ ఆల్బంను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తా. దాంతోపాటు గోపీచంద్ మలినేని, సాయిధరమ్ తేజ్‌ల సినిమాకు మ్యూజిక్ చేస్తున్నా.

-శ్రీ