కళ్యాణ్‌రామ్‌తో రొమాన్స్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎఫ్ 2’ హిట్టుతో మెహ్రీన్‌కీ అవకాశాలు మెరుగవుతున్నాయి. మారాం.. గారంలాంటి పాత్రతో ఆకట్టుకున్న మెహ్రీన్‌ని వెతుక్కుంటూ చాలా అవకాశాలే వస్తున్నా -అన్నింటికీ ఓకె చెప్పకుండా ఆచి తూచి అడుగేస్తోంది. అందాల భామ హీరోయిన్‌గా బిజీ అవ్వడం కంటే, వచ్చిన అవకాశాల నుంచి నచ్చినవాటిని ఎంపిక చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోంది. అలా తాజాగా మెహ్రీన్ ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కల్యాణ్‌రామ్‌తో రొమాన్స్ చేయడానికి మెహ్రీన్ ఓకే చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం వేణు మల్లిడి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ ‘తుగ్లక్’ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ప్రాజెక్టు చేయనున్నాడు. ఆ ప్రాజెక్టు కోసం హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సతీశ్ వేగెశ్న, కళ్యాణ్‌రామ్‌తోనూ అదే తరహా సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను కళ్యాణ్ కోసం సిద్ధం చేశాడని అంటున్నారు. ఈ కథలో మెహ్రీన్‌కీ అంతే ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.