సంతోషంగా.. బేబక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత లీడ్‌రోల్‌లో తెరకెక్కుతోన్న వైవిధ్యమైన చిత్రం -ఓ బేబీ. 20ఏళ్ల అమ్మాయి శరీరంలోకి 70ఏళ్ల వృద్ధురాలి ఆత్మ చేరితే.. అన్న పాయింట్‌తో తెరకెక్కిన కొరియన్ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు నందినిరెడ్డి. ఆ పాత్రను స్టార్ హీరోయిన్ సమంతా పోషిస్తుండటంతో -ప్రాజెక్టుపై మరింత ఆసక్తి రేకెత్తింది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అనుభవాన్ని సామ్ -ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘నానమ్మ, తాతయ్య లేకుండా పెరిగాను. వాళ్లతో హ్యాపీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎలాఉంటుందో తెలుసుకోడానికి దర్శకురాలు నందినిరెడ్డి నన్ను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ అద్భుతమైన వ్యక్తుల్ని కలిశా. అక్కడి వృద్ధుల్లోని పసిపిల్లల మనస్తత్వం చూసి ఆశ్చర్యపోయా. వాళ్ల స్వభావాలను స్వయంగా పరిశీలించిన తరువాతే ‘బేబక్కా’ పాత్ర పోషించా’ అంటోంది సామ్. ఇదిలావుంటే, ‘నాలో మైమరపు’ పాటకు సంబంధించి మేకింగ్ ఎక్స్‌పీరియన్స్‌నీ తాజాగా విడుదల చేశారు. సమంత, నాగశౌర్యపై డిజైన్ చేసిన అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ వెనుక ‘వాళ్లిద్దరి మధ్య కుక్కులకు సంబంధించిన చర్చ జరిగిందంటూ’ దర్శకురాలు నందినిరెడ్డి వెరైటీ విషయాన్ని వెల్లడించి ఆసక్తిని పెంచారు. త్వరలోనే ఛాంగుభళా లిరికల్ వీడియోనూ చిత్రబృందం విడుదల చేయనుంది.