వీడే.. ఆ చాణక్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో గోపీచంద్ తాజా చిత్రం చాణక్య ఫస్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేసినట్టు ప్రకటించింది. జనంమధ్య నిలబడిన హీరో -తన లక్ష్యానికేసి తీక్షణంగా చూస్తోన్న చాణక్య ఫస్ట్‌లుక్ ఆసక్తికరంగా ఉంది. పెరిగిన గడ్డం, మెడలో మఫ్లర్‌తో జనం మనిషిలా గోపీచంద్‌కు మాస్ మేకోవర్ ఇచ్చారు. దర్శకుడు తిరు యాక్షన్ థ్రిల్లర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గోపీచంద్ సరసన మెహ్రీన్, జరీనాఖాన్ హీరోయిన్లు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర సినిమా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు.