ఆది.. క్లాప్‌కొట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి కొత్త కథ మొదలెట్టాడు. అథ్లెటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రాజెక్టుకు ‘క్లాప్’ టైటిల్ ప్రకటించారు. రెండు విభిన్నమైన పాత్రల్ని ఆది పోషించనున్నాడు. ఆది సరసన ఆకాంక్ష సింగ్ కనిపించనుంది. దర్శకుడు పృథ్వి ఆదిత్య తెరకెక్కించనున్న చిత్రాన్ని ఐబి కార్తికేయన్, యం రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి కళ్యాణ్, చంటి అడ్డాల, శోభారాణి, కొమర వెంకటేష్, హీరో నాని, సందీప్‌కిషన్, దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్షసింగ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఇళయరాజా క్లాప్‌నివ్వగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తమిళ చిత్రానికి హీరో నాని క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా అది పినిశెట్టి మాట్లాడుతూ -పృధ్వీ ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే -ఈ లైన్ హార్ట్ టచింగ్ అనిపించింది. రెండు షేడ్స్‌వున్న పాత్రల్లో కనిపిస్తాను అన్నారు. దర్శకుడు పృధ్వి ఆదిత్య మాట్లాడుతూ -పాయింట్ విన్నవెంటనే కార్తికేయన్, కథ వినగానే ఆది ఓకే అనేశారు. అథ్లెటిక్స్ నేపథ్యంలో సాగే కథ ఇది అన్నారు. హీరోయిన్ ఆకాంక్షసింగ్ మాట్లాడుతూ- తెలుగులో ఇది మూడో సినిమా. ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపిస్తానన్నారు. సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ -ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు పెద్ద అస్సెట్ కానుంది. 17నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, నాలుగు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం అన్నారు.