పాండిచ్చేరిలో సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటీష్ కాలంనాటి కథ. దేశభక్తిని రగిల్చే ఉద్యమకారుడి పాత్ర. 200 కోట్ల బడ్జెట్. హీరో చిరంజీవి. జోడీగా నయనతార. వెరసి -సైరా. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా ప్రాజెక్టు -సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటోంది. కథాకాలంనాటి దృశ్యాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రాజెక్టు ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, సినిమా నేపథ్యానికి ఆయువుపట్టులాంటి సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రబృందం పాండిచ్చేరిలో మకాం వేసినట్టు తెలుస్తోంది. యూనియన్ టెరిటరీ పరిధిలోవున్న పాండిచ్చేరిలో ఇప్పటికీ బ్రిటీష్ కాలంనాటి భవనాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కథాకాలానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు అక్కడ ప్లాన్ చేసినట్టు సమాచారం. బ్రిటీష్ టీం -ఉద్యమకారుడు నరసింహారెడ్డి బృందం మధ్య జరిగే ఒక ఒప్పందానికి సంబంధించిన సన్నివేశాలను పాండిచ్చేరి బ్రిటీష్ భవనాల్లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. చిరు పుట్టిన రోజు ఆగస్టు 22న ‘సైరా’ టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సమాయత్తమవుతుంది. దసరా సీజన్‌లో సినిమాను విడుదల చేయాలన్న ఆలోచన నేపథ్యంలో -అక్టోబర్ 2 గాంధీజయంతి రోజున సినిమాను థియేటర్లకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.