టీజర్‌కొచ్చిన రెండో మన్మథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్మథుడు-2 టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం టీజర్‌ను విడుదల చేస్తున్నామంటూ చిత్రబృందం ఇప్పటికే ప్రకటిస్తూ ప్రత్యేక జిఫ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘కింగ్ ఇప్పుడు కింగ్ ఆఫ్ హార్ట్స్’ కాబోతున్నాడు -అంటూ సినిమాలో నాగ్‌తో జోడీ కట్టిన రకుల్‌ప్రీత్ ట్వీట్ చేసింది. సమంత, కీర్తిసురేష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రానికి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. చి.ల.సౌ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలందుకున్న రాహుల్ -మన్మథుడు 2పై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టాడు. నాగార్జున, జెమిని కిరణ్ నిర్మిస్తోన్న సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. రెండో మన్మధుడితో రకుల్ ప్రీత్‌సింగ్, కీర్తిసురేష్, గొడుగు పట్టిన సమంత.. ఇలా విడుదల చేసిన స్టిల్స్‌లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయ. ఒక షెడ్యూల్ వినా దాదాపుగా సినిమా షూటిగ్ పూర్తయనట్టు చిత్రబృందం చెబుతోంది.