మహేష్.. మళ్లీ వంశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహర్షి మూడ్‌ని మహేష్‌బాబు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుతో మహేష్‌కు అనూహ్య విజయాన్ని కట్టబెట్టాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. సిల్వర్ జూబ్లీకి ఫినిషింగ్ టచ్‌గా చేసిన ప్రాజెక్టు -మహేష్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆ ఆనందాన్ని దేశంలోను, విదేశాల్లోనూ ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు మహేష్. ఇప్పటికే వంశీని అనేక విధాల ప్రశంసించిన మహేష్ -విదేశాలకు వెళ్తూ వెళ్తూ కొత్త ప్రాజెక్టుకు సిద్ధంకమ్మని వంశీకి చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి.
26వ ప్రాజెక్టుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్న మహేష్ -ప్రాజెక్టును అనిల్ రావిపూడికి ఓకే చేయడం తెలిసిందే. ‘ఎఫ్2’లాంటి సింపుల్ స్టోరీతో వెంకీ, వరుణ్‌లకు భారీ హిట్టిచ్చిన అనిల్ రావిపూడి -మహేశ్ ప్రాజెక్టు కోసం అదేతరహా కసరత్తులు చేస్తున్నాడట.
అనిల్‌తో ప్రాజెక్టు తరువాత మహేష్‌బాబు -అర్జున్‌రెడ్డి లాంటి భారీ హిట్ తీసిన సందీప్‌రెడ్డి వంగాకు క్లియరెన్స్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వినిపించింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ ప్రాజెక్టుతో బిజీగావున్న సందీప్, ఆ ప్రాజెక్టు పూర్తికాగానే మహేష్‌తో ప్రాజెక్టు చేస్తాడనే అనుకున్నారు అంతా. ఇదంతా ‘మహర్షి’ షూట్ జరుగుతున్న టైంనాటి పరిస్థితి. మహర్షి హిట్టు తరువాత ఈక్వేషన్ మారింది. అనిల్ ప్రాజెక్టు తరువాత మళ్లీ వంశీతోనే సెట్స్‌పైకి వెళ్లాలని మహేష్ ఫిక్సైనట్టే కనిపిస్తోంది. కాకపోతే -ఈ కాలిక్యులేషన్ కంటిన్యూ అవుతోందో లేదో అనిల్ ప్రాజెక్టు తరువాతగానీ తెలీదు.