అదో టైపు.. రెండో మన్మథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు దాటిపోతున్నా పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్ చేసే ‘మన్మథుడు’ వచ్చేశాడు. నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన సినిమా -మన్మథుడు 2. మన్మథుడికి సీక్వెల్‌గా వస్తున్న మన్మథుడు 2 టీజర్ గురువారం విడుదలైంది. ‘నీకు షట్టర్లు మూసేసి దుకాణాలు సర్దేసే వయసొచ్చేసింది. మరి ఇంతందంగా పుట్టి ఏంప్రయోజనంరా’ అని నటి దేవదర్శిని నాగ్‌ని ఉద్దేశించి చెప్పే సెటారిక్ డైలాగ్‌తో మొదలైన టీజర్‌ను చూస్తుంటే, ఫన్‌కంటెంట్ ఏమేరకు ఉండబోతుందో అర్థమవుతుంది. నాగ్ లేట్ మ్యారేజ్‌పై వెనె్నల కిషోర్ సైతం సెటైర్ వేస్తూ.. ‘ఈ వయసులో మీకు పెళ్లేంటిసార్.. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే పూలు పూస్తాయా.. ఏంటి?’ అంటాడు. ‘పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన టైంలో నువ్వు బ్యాటింగ్‌కి దిగుతున్నావేంట్రా’ అంటూ రావ్ రమేష్ చేత అనిపించటం, ‘నువ్వు.. వర్జిన్‌వే కదా?’ అని అడుగుతూనే ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ బామ్మ (లక్ష్మి), అమ్మ (దేవదర్శిని) నుంచి రెండో మన్మథుడి వెంట పడటం చూస్తే -టీజర్‌లో ఫన్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్‌తో పాటు డబుల్ మీనింగ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. నాగ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ గడిపేస్తున్న షాట్స్‌ని టీజర్‌లో కట్‌చేశారు. చివర్లో నాగ్ స్టైల్‌గా ‘ఐ డోన్ట్ ఫాల్ ఇన్ లవ్. ఐ ఓన్లీ మేక్ లవ్’ అని చెబుతున్న డైలాగ్ హైలెట్. కుర్ర హీరోలతో పోటీపడేలా నాగ్.. హగ్‌లు, కిస్సులతో రెచ్చిపోయనట్టే కనిపిస్తోంది. రకుల్‌ప్రీత్ సింగ్, కీర్తిసురేష్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రంలో నాగ్ కోడలు సమంత అతిథి పాత్ర చేస్తోంది. ఆగస్టు 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.