అంజలి, లక్ష్మీరాయ్‌ల ఆనందభైరవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం -ఆనందభైరవి. ఇటికెల రమేష్ రెడ్డి నిర్మాత. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ -అంజలి, ఆదిత్ అరుణ్‌లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు బాగా వచ్చాయి. బడ్జెట్‌పై రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో ఉంటుంది అన్నారు. దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ -ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు. ఆ పాత్రకోసం అంజలి చాలా స్లిమ్ అయ్యారు. ఆదిత్ అరుణ్‌తో అంజలి కెమిస్ట్రీ అద్భుతం. కెమెరామెన్ పిజి విందా పనితనం, మణిశర్మ మ్యూజిక్ ప్రాజెక్టుకు ప్లస్‌లు. తదుపరి షెడ్యూల్‌లో లక్ష్మీరాయ్‌పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తాం అన్నారు.