చెప్పేదేం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో అవకాశాల కోసం మొహమాటం లేకుండా -గ్లామర్ పాత్రను పోషించిందంటూ రకుల్‌ప్రీత్‌పై కామెంట్లు రావడం తెలిసిందే. ఈమధ్యే వచ్చిన ‘దే దే ప్యార్ దే’ చిత్రంలో తళుక్కుమన్న రకుల్ -పాత్రపరంగా గ్లామర్‌ను చూపించడానికి ఏమాత్రం తగ్గలేదు. మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండే రకుల్ -‘బ్యూటీ’ని మించి బ్యూటిఫుల్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తుంటుంది. ఫొటోషూట్ స్టిల్స్‌తో నెట్టింట సెగలు పుట్టించే రకుల్ -ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పెట్టి మరింత సెగలు రేపింది. దీంతో రకుల్ వస్తధ్రారణపై నెటిజన్లు తీవ్ర విమర్శలే చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ ఆంగ్ల మీడియా దగ్గర స్పందించిన రకుల్ -తెలివైన సమాధానంతో సమస్యను కవర్ చేసుకుంది. ‘గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నా. డ్రెస్సింగ్‌ను ప్రశ్నిస్తే నాదగ్గర సమాధానమేం ఉంటుంది. పది విమర్శలుంటే వంద ప్రశంసలుంటాయి. దేనికి రెస్పాండ్ అవ్వాలి. ప్రొఫెషనల్ కెరీర్‌పై విమర్శలు చేస్తే స్పందించగలను. ఆ కామెంట్లు తల్లిదండ్రులపై ప్రభావం చూపుతాయనుకంటే రిప్లై ఇవ్వగలను. అంతకుమించి ఏం చేస్తాం’ అంటూ ప్రశ్నించింది. డ్రెస్సింగ్ విషయంలో సెలబ్రిటీలను బయటివాళ్లూ అనుకరించడం వల్ల లైంగిక వేధింపుల కేసులు అధికమవుతున్నాయంటూ నెటిజన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై -‘దీనిపై స్పందించే ఆలోచన లేదు. ఎవరికి వారు ఆలోచనల్ని కలుషితం చేసుకుంటే మనమేం చేయగలం?’ అంటూ తెలివిగా ప్రశ్నించింది. ‘దే దే ప్యార్ దే’లో రకుల్ చేసిన పాత్రతో -ఆమెపై బాలీవుడ్ ఫోకస్ పెరిగినట్టే కనిపిస్తోంది. ఇటు టాలీవుడ్‌లో సీనియర్, జూనియర్ హీరోల సరసన ఒదిగిపోతూనే -బాలీవుడ్‌లోనూ గట్టి ప్రయత్నాలే చేస్తోంది రకుల్. గురువారం విడుదలైన నాగ్ ‘మన్మధుడు-2’ టీజర్‌లో రకుల్ తళుక్కుమంది.