నేనున్నాను.. సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టు.. దానికితోడు బడ్జెట్‌కు వెరవకుండా యువీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సినిమా.. మరోపక్క బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకఫూర్ హీరోయిన్... హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గని నిర్మాణస్థాయి... వెరసి -సాహో. ప్రాజెక్టు మొదలెట్టిన దగ్గర్నుంచీ పతాక శీర్షికన చర్చ జరుగుతుండటంతో ‘సాహో’ -ప్రత్యేక సినిమాగా బిల్డప్ క్రియేటైంది. రెండు రోజులునుంచీ ఊదరగొట్టిన ప్రచారం తరువాత -గురువారం ‘సాహో’ టీజర్ బయటికొచ్చింది. విడుదలవుతున్న అన్ని భాషల్లోనూ టీజర్ విడుదల చేసినట్టు సమాచారం. ‘బాధైనా హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోడానికి ఎవ్వరూ లేరు’ అంటూ శ్రద్ధాకఫూర్ కంటతడి పెడుతూ చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది. హీరో ప్రభాస్ శ్రద్ధను దగ్గరకు తీసుకుని ‘నేనున్నా’ అంటూ రిప్లై ఇవ్వడాన్ని టీజర్‌లో హైలెట్ చేశారు. అన్నట్టుగానే యాక్షన్ సీన్స్‌ని హాలీవుడ్ రేంజ్‌కు తగ్గట్టుగానే డిజైన్ చేసినట్టు కనిపించింది. సీజీ కోసం సినిమా టీం ఎంత కష్టపడిందన్న టీజర్‌తోనే అర్థమవుతోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ విలన్స్‌నుంచి తప్పించుకుని దాకున్న సందర్భంలో జరిపిన సంభాషణనూ టీజర్‌లో చూపించారు. ‘ఎవరు వీళ్లు’ అన్న శ్రద్ధ ప్రశ్నకు ‘్ఫ్యన్స్’ అంటాడు ప్రభాస్. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు’ అన్న అమాయకపు ప్రశ్నకు ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అంటూ రెండురకాల అర్థం వచ్చేలా ప్రభాస్ చెప్పే మేనరిజం డైలాగ్ బావుంది. హీరో హీరోయిన్లను కవర్ చేస్తూ, భారీతనాన్ని చూపడానికే టీజర్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సుజీత్ తెరకెక్కించిన చిత్రంలో బాలీవుడ్ ఆర్టిస్ట్ నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీశర్మ, జాకీష్రాఫ్, మందిరాబేడి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ముంబయిలో జరుగుతోన్న షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ దాదాపుగా పూరె్తైనట్టేనని చిత్రబృందం చెబుతోంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.