యాగంటిలో వాల్మీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి యాక్షన్ ఎపిసోడ్స్‌కి వచ్చేశాడు. వరుణ్‌తేజ్‌ను వైవిధ్యమైన మేకోవర్‌లో చూపిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం -వాల్మీకి. ఈమధ్యే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. తొలి షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రబృందం, తదుపరి షెడ్యూల్ కోసం ‘యాగంటి’కి చేరింది.
దర్శకుడు హరీశ్‌శంకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘శివుని ఆశీస్సులతో యాగంటి పుణ్యక్షేత్రంలో షూటింగ్ మొదలుపెట్టాం’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యాగింటిలో యాక్షన్ ఎడిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. హీరో వరుణ్‌తేజ్, బ్రహ్మాజీ తదితరులు యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటారట. గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’కి ఇది రీమేక్. వరుణ్‌తేజ్‌తోపాటు అధర్వ మురళి నటిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనుంది. మరో హీరోయిన్‌గా తెలుగు అమ్మాయిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.