ఇది.. ర్యాంకర్ల బయోపిక్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారాయి సినిమాతో హీరోగా పరిచయమైన చేతన్ మద్దినేని ‘్ఫస్ట్ ర్యాంక్ రాజు’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కన్నడకు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా 21న విడుదలవుతోన్న సందర్భంగా
హీరో చేతన్ చెప్పిన విశేషాలు..
యూనివర్సల్ సబ్జెక్ట్: ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఈ కథకి ఎవరైనా కనెక్టవుతారు. అందుకే రీమేక్ చేశాం. మా నాన్నఫ్రెండ్ సజెషన్‌తో కన్నడలో సూపర్‌హిట్ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేశాం. అయితే సినిమాలో సోల్ మిస్సవ్వకుండా తెలుగు నేటివిటీలో స్క్రిప్ట్ రెడీ చేశాం. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి బాగా నచ్చుతుంది. ఫస్ట్ ర్యాంకర్ల బయోపిక్‌లా అనిపిస్తుంది.
మారుతీ ఇన్‌పుట్స్..: ఫస్ట్‌ర్యాంక్ రాజు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతని సంప్రదిస్తే ఆయనే తెలుగులో కూడా నిర్మిస్తానని చెప్పారు. కథ మీద ఆయనకి చాలా నమ్మకం. అందుకే తెలుగులోనూ ఆయనే నిర్మించారు. రీమేక్ చేయాలనుకున్నపుడు మారుతి దగ్గరకు వెళ్తే, ఆయన కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చారు. ఆయన చెప్పిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి.
మంచి పాత్రలు: నిజానికి నటుడిగా నాకు మొదటిలోనే మంచి రోల్స్ వచ్చాయి. రోజులు మారాయి తరువాత గల్ఫ్ సినిమా రూపంలో అనుకోని ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చింది. ఇపుడు ఫస్ట్‌ర్యాంక్ రాజు. ఫ్యూచర్‌లోనూ మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది. రీసెంట్‌గా ఐ ఫోన్ సెవెన్ ప్లస్‌తో సినిమా తీశాం. సినిమా బాగా వచ్చింది. ఐ ఫోన్ ప్రేమికుడు అనే టైటిల్ అనుకుంటున్నాం. త్వరలోనే సినిమా వివరాలు వెల్లడిస్తా.