రణ్‌వీర్ @ 800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హీరో రేంజ్ ఒక్కోసారి వసూళ్లపరంగానూ చూడటం మామూలే. ఆ కోణంలో రణవీర్ సింగ్ వరుస విజయాలతో టాప్ రేంజ్‌కు చేరాడు. కేవలం మూడు సినిమాలతో ఏడాదిలో 800 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టిన హీరోగా క్రేజ్ సంపాదించాడు. సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్‌తో ప్రయాణం మొదలెట్టి సింబా, గల్లీబోయ్‌లాంటి చిత్రాల్లో తన పెర్ఫార్మెన్స్ స్టామినా చూపించాడు రణవీర్. ఏడాది కాలంలో విడుదలైన మూడు సినిమాకు 800 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ కలెక్షన్ హీరోగా గుర్తింపు సాధించాడు రణవీర్. వైవిధ్యమైన పాత్రలు, కథలకు ప్రాధాన్యతనిస్తున్న రణవీర్ -నేను డబ్బు వెనుక కాదు, ప్రేమ వెనుక పరిగెడతాను’ అంటూ సింబాలోని డైలాగ్‌ను వాస్తవంలో రుచి చూపిస్తున్నాడు. ‘సినిమా నిర్మాణం అనేది రిస్క్‌తో కూడుకున్నదని, నాపైవున్న నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటున్నాడు రణవీర్. ‘నా ఈ స్థాయికి కారణం పరిశ్రమ. అన్నివిధాల హిందీ సినిమా అభివృద్ధికి నావంతు కృషి చేస్తుంటా. నా కుటుంబానికి అన్నం పెడుతూ, ఆత్మీయులైన మిత్రులను అందించిన సినిమా పరిశ్రమకు నేనెప్పుడూ రుణపడి ఉంటానంటున్నాడు రణవీర్. భారతీయ సినిమా పరిశ్రమ ఆర్థిక ప్రగతికి నావంతు సాయం చేయగలిగానన్న సంతృప్తి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని రణ్‌వీర్ వ్యాఖ్యానించటం గమనార్హం.