ఎక్కడ తగ్గాలో తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రకోసం ప్రయోగం చేయమని దర్శకుడు అడగటం, హీరోలు అందుకు సాహసం చేయడం -అన్ని పరిశ్రమల్లోనూ కొంతకాలంగా సాగుతోన్న ట్రెండే. దర్శకుడు ఆశించే మేకోవర్ కోసమే ఇలా మారిపోయానంటూ చాలామంది హీరోలు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. అగ్ర దర్శకుడు కొరటాల శివ సైతం అగ్ర హీరో చిరంజీవి నుంచి అదే ఆశిస్తున్నాడట. కొరటాల సూచన మేరకు చిరు సైతం బరువు తగ్గేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు ‘సైరా’తో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2న సినిమా విడుదల చేయాలన్న నిర్ణయానికి రావడంతో మరింత వేగంగా ‘సైరా’ పనులు పూర్తి చేస్తున్నారు. అటు డబ్బింగ్ పనులు, ఇటు సీజీ పనులు సమాంతరంగా సాగిపోతున్నాయి. దీని తరువాత చిరు, కొరటాలతో ప్రాజెక్టు చేయాల్సి ఉంది. టాలీవుడ్‌లో పెద్ద హీరోలంతా సందేశాత్మక చిత్రాల ఒరవడి సాగిస్తోన్న నేపథ్యంలో, -చిరుతోనూ కొరటాల అదే ట్రాక్‌పై కథను తెరకెక్కించే ఆలోచనతో ఉన్నాడని అంటున్నారు. అయితే చిరు సినిమా అంటే ఫ్యాన్స్ కోసం ఫైట్లు, డ్యాన్స్‌లు తప్పదు కనుక -‘సైరా’ కోసం పెంచిన బరువు కాస్త తగ్గించుకోమంటూ దర్శకుడు సూచించాడట. బరువు తగ్గనున్న చిరంజీవి ఎలాంటి అప్పియరెన్స్‌లో కనిపించనున్నాడోనన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.